Actor Prakash Raj Again Makes Controversial Comments On Modi | Oneindia Telugu

2019-01-18 539

After six months, PM Narendra Modi will be just another MP: Prakash Raj
#PrakashRajCommentsOnModi
#PrakashRaj
#PMNarendraModi
#Comments
#kollywood
#tollywood


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయ పరమైన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రకాష్ రాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే చేసే ప్రతి విమర్శ నేషనల్ మీడియాలో హైలైట్ అవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాష్ రాజ్ తన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేశారు. తాను రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అప్పటి నుంచి నరేంద్ర మోడీపై మరింతగా విమర్శల దూకుడు పెంచారు. తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదభరితంగా మారుతున్నాయి.